Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సల్మాన్ పై హత్యాయత్నం - మూడు రౌండ్ల కాల్పులు...

Advertiesment
salman khan

వరుణ్

, ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (10:29 IST)
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగి ఉన్న ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జరపడం సంచలనం రేపింది. గత కొద్దికాలంగా సల్మాన్ ఖాన్‌కు ప్రాణ హాని తలపెడుతామని అగంతకులు వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఆయనకు భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ నివాసంపై జరిగిన కాల్పుల వివరాల్లోకి వెళితే..
 
ముంబై పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పలు జరిపారు. మోటార్ సైకిల్స్‌పై వచ్చిన అగంతకులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాం అని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
 
ఇదిలా ఉండగా, బాంద్రాలోని సల్మాన్ ఖాన్ అధికార నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన కాల్పుల కలకలం సమాచారం అందుకొన్న వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. ఆ ప్రాంతంలో గోడలపై ఉన్న బుల్లెట్ ఆనవాళ్లను, బుల్లెట్స్‌ను ఫోరెన్సిక్ విభాగానికి పంపినట్టు తెలిపారు
 
ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ముప్పు ఉంది. దేశంలోనే ముప్పు ఉన్న టాప్ 10 సెలబ్రిటీలలో సల్మాన్ ఖాన్ ఒకరు అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ముద్దాయిగా ఉన్న సల్మాన్.. తమ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బ తీశారనే నెపంతో గతంలో డెత్ వార్నింగ్ లు ఇచ్చిన సందర్భాలున్నాయి 
 
ఇటీవల సంపత్ నెహ్రా అనే గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విచారించగా సల్మాన్ ఖాన్‌ను చంపడానికి సుపారీ ఇచ్చారనే విషయాన్ని ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. అప్పటి నుంచి ఆయనకు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారని చెబితే అమ్మ నమ్మలేదు : హీరో రామ్ చరణ్