Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఆలయంలో ఖాకీ యూనిఫామ్‌‍కు నో ఎంటీ.. పోలీసులకు స్పెషల్ డ్రెస్!!

kashi temple

వరుణ్

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (09:41 IST)
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఒకటి. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయంలో భద్రత కోసం విధులు నిర్వహించే పోలీసులు ఇక నుంచి ఖాకీ యూనిఫామ్స్ దుస్తులు ధరించడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలోకి కాకీ యూనిఫాంకు స్వస్తి చెప్పనున్నారు. పురుషులకు ధోతీ - షాల్, మహిళా పోలీసులకు శల్వార్ - కుర్తా యూనిఫామ్‌లను అందజేయనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో స్నేహపూర్వకంగా నడుచుకునేలా పోలీసులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా, రద్దీ సమయంలో నో టచ్ పాలసీని అమలు చేయనున్నారు. అలాగే, క్యూలైన్లను తాళ్లతోనే నియంత్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆలయంలో భద్రతా విధులు నిర్వహించే పోలీసులపై అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. 
 
కాశీ విశ్వనాథుడి ఆలయంలో భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్తిపలికారు. ఖాకీ యూనిఫామ్ కలిగే ప్రతికూల అభిప్రాయలను తొలగిచేందుకు ఆలయ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసుల సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు. అంతేకాకుండా, ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకువాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
 
భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పలు ఇతర చర్యలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఆలయంలో రద్దీ నియంత్రలో 'నో టచ్' విధానాన్ని అవలంబించనున్నారు. భక్తులను నేరుగా తాకకుండా తాళ్లతో క్యూ లైన్లను నియంత్రిస్తారు. “దర్శనం కోసం భక్తులు పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు రద్దీ నియంత్రణలో స్నేహపూర్వక విధానాలను అవలంబించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నాం” అని కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్ తెలిపారు.
 
వీఐపీ దర్శనాల సందర్భంగా భక్తుల క్యూలను తాళ్లతో నియంత్రిస్తూ వీఐపీలకు మార్గం సుగమం చేస్తారు. భక్తులనుఎట్టి పరిస్థితుల్లో చేతుల తోస్తూ నియంత్రించేందుకు ప్రయత్నించరని అధికారులు పేర్కొన్నారు. కాశీ విశ్వానాథుడి ఆలయ రినోవేషన్ తరువాత గత రెండేళ్లల్లో భక్తుల రద్దీ పెరిగింది. దాంతో పాటూ పోలీసులపై ఫిర్యాదులూ పెరిగాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులను బలవంతంగా పక్కకు నెడుతున్నారని అనేక మంది ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మార్పులకు శ్రీకారం చుట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశీ విశ్వనాథ్ ఆలయంలో పోలీసులకు డ్రెస్ కోడ్.. నో టచ్ విధానం