వినాయక చతుర్థి రోజున ఉండ్రాళ్ళు, పాలతాలికలు, పండ్లు వంటివి గణేశునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి నైవేద్యాల్లో ఒకటైన పాలతాలికలను ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు
పాలు - ఒకటిన్నర లీటరు.
నీళ్లు - ఒక లీటరు.
పంచదార - పావు కేజీ
బెల్లం - పావుకేజి.
యాలకుల పొడి - ఒక టీ స్పూను.
నెయ్యి - కొద్దిగా.
సగ్గు బియ్యం - వందగ్రాములు.
బియ్యపిండి - వందగ్రాములు.
మైదాపిండి - రెండు టీ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా పాలను నీటిని మరిగించాలి. అందులో సగ్గుబియ్యాని కూడా ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదారతో పిండిలా కలుపుకోవాలి. పిండిని తాలికల్లా చేసుకుని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ఈ జంతికలు అతుక్కోకుండా కలుపుతూ వుండాలి. తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, యాలకుల పొడిని వేసి కలపాలి. అంతే పాల తాలికలు సిద్ధమైనట్లే. ఈ వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.