Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీవీ సింధుపై మనసుపడిన వృద్ధుడు... పెళ్లి చేస్తారా? లేక కిడ్నాప్ చేయనా?

పీవీ సింధుపై మనసుపడిన వృద్ధుడు... పెళ్లి చేస్తారా? లేక కిడ్నాప్ చేయనా?
, మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (16:30 IST)
ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపై ఓ 70 యేళ్ళ వృద్ధుడు మనసుపడ్డారు. ఆమెతో తనకు పెళ్లి జరిపించాలంటూ పట్టుబట్టారు. ఈ మేరకు ఆయన ఏకంగా జిల్లా కలెక్టర్‌కు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు పీవీ సింధుపై మనసుపడ్డారు. ఆమెను వివాహమాడాలని కలలుగన్నాడు. దీంతో ఆమెను తనకిచ్చి పెళ్ళి చేయాలంటూ పట్టుబట్టారు. ఈ మేరకు రామనాథపురం జిల్లా కలెక్టర్‌కు ఓ వినతిపత్రం కూడా సమర్పించారు. 
 
సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని అందులో పేర్కొన్నారు. ఆ ఆశ్చర్యకర సంఘటన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశం (గ్రీవెన్స్ డే)లో చోటుచేసుకుంది. 
 
దీనిపై వృద్ధుడు మలైస్వామి స్పందిస్తూ, సింధు ఆటతీరు తనను మంత్రముగ్ధుడిని చేసిందన్నారు. ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను (సింధు, మలైస్వామి) జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. 
 
అయితే ఆ పిటిషన్‌లో మలైస్వామి ... తన వయస్సు కేవలం 16 ఏళ్లని, 2004 ఏప్రిల్‌ 4న పుట్టానని పేర్కొన్నాడు. ఈ వింత అభ్యర్థనపై కలెక్టర్‌తో పాటు విషయం తెలిసినవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే మలైస్వామి మాత్రం సింధుతో తన పెళ్లి చేయాల్సిందేనని పట్టుపడుతున్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ రిటైర్మెంట్ వార్తలు.. ఇందులో సస్పెన్స్ ఏమీ లేదన్న అయాజ్