Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడెమీ

Advertiesment
PV Sindhu
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (16:12 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పివి సింధు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను కలిసారు. క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పివి సింధు తల్లిదండ్రులు పివి రమణ, లక్ష్మి, క్రీడాసంఘాల ప్రతినిధి ఛాముండేశ్వరీనాద్, అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాప్‌ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌తో భేటీ అయ్యారు. 
 
ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సాధించిన బంగారు పతకాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆమెను అభినందించారు. పివి సింధును శాలువతో సత్కరించారు. అనంతరం సెక్రటేరియట్‌‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి పివి సింధు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తనను అభినందించడం సంతోషంగా వుందన్నారు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ అండగా వుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 
 
అలాగే విశాఖపట్నంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. పద్మభూషణ్‌ కోసం కేంద్రం తన పేరును నామినేట్‌ చేసినట్లు తెలిసిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు.
webdunia
 
బంగారు పతకం సాధించిన తరువాత మొట్టమొదటి సారిగా మన రాష్ట్రానికి వచ్చిన బ్యాడ్మింటెన్‌ క్రీడాకారిణి పివి సింధుకు ఘనంగా ఆహ్వానం పలికామని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారని, పీవీ సింధు సాధించిన విజయం పట్ల సీఎం చాలా సంతోషం వ్యక్తంచేశారన్నారు. అలాగే భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సీఎం మనస్పూర్తిగా ఆకాంక్షించారన్నారు. 
 
రాబోయే ఒలంపిక్స్‌ క్రీడల్లో పివి సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని సీఎం ఆకాక్షించారని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడపిల్లలకు ఒక బ్యాడ్మింటన్‌ అకాడమీ వుంటే బాగుంటుందని పివి సింధు కోరిన మీదట విశాఖపట్నంలో 5 ఎకరాలను కేటాయిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం అండగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మన తెలుగు అమ్మాయి అయిన సింధూకు అన్నిరకాల ప్రోత్సాహం ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతిని ముద్దాడిని అనుష్క... ఎమోషనల్‌ అయిన కోహ్లీ (Video)