Publish Date: Wed, 14 Jan 2026 (14:30 IST)
Updated Date: Wed, 14 Jan 2026 (14:34 IST)
పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఉదయాన్నే భోగి మంటలతో తెలుగు వాకిళ్లు వేకువనే వెలుగులు పూయించాయి. సాయంత్రం వేళ చిన్నారులకు భోగపళ్లు పోసే కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహిస్తారు. దిష్టి తగలకుండా, దీర్ఘావుయు కలిగి సకల శుభాలతో నిండు నూరేళ్లు చల్లగా వుండాలని భోగిపళ్లు పోస్తారు.
చిన్నారులకు భోగి పళ్లు పోసేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఏమిటో తెలుసుకుందాము.
ఆయుష్యమస్తు ఆరోగ్యం - అస్తు ఐశ్వర్యమస్తు చ
ధర్మ కర్మ సమృద్ధిరస్తు - ఇతి వేదవిదో విదుః
ఈ శ్లోకం అర్థం ఏమిటంటే... నీకు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, సకల ఐశ్వర్యాలు లభించుగాక. ధర్మబద్ధమైన పనులు చేసే శక్తి, సమృద్ధి నీకు కలుగుగాక అని పెద్దల ఆశీర్వాదాలు ఇస్తారు.