Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి భక్తులు అలా హెచ్చరించిన టిటిడి ఇఓ

శ్రీవారి భక్తులు అలా హెచ్చరించిన టిటిడి ఇఓ
, శనివారం, 7 ఆగస్టు 2021 (23:06 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెసిఫైడ్ అథారిటీ కమిటీ చైర్మన్ డాక్టర్ జవహర్ రెడ్డి  శ్రీవారి భక్తులకు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ఎవరో నిర్లక్ష్యంగా ఉండవద్దని మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని.. సామాజిక దూరాన్ని పాటించి తీరాలని సూచించారు.
 
కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని చాలామంది తిరుమలలో మాస్కులు ఉన్నా వేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని.. అలాగే గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారని.. టీటీడీ సిబ్బంది ఎన్నిసార్లు భక్తులకు చెబుతున్న వినిపించుకోవడం లేదన్నారు ఇఓ. కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.
 
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పట్లో ఆన్‌లైన్‌లో టోకెన్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఇచ్చే టోకెన్లను 5 వేల నుంచి 8 వేలు చేశామన్నారు. అంతకుమించి టోకెన్లను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
టోకెన్లను పెంచాలన్న ఆలోచన కూడా తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు టోకెన్లను పెంచేస్తారన్న ఆలోచన అస్సలు లేదన్నారు. కరోనా తీవ్రత బాగా తగ్గిందని అనిపిస్తే అప్పుడు ఆలోచన, నిర్ణయాలు ఉంటాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-08-2021 శనివారం దినఫలాలు - ఈశ్వరుని ఎర్రని పూలతో పూజించినా...