కలియుగం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే భాగ్యం లభించాలంటే కొన్ని నెలలకు ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా అక్టోబరు నెలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలని భావించే వారికి దర్శనం, గదుల కోటా విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు వెల్లడించింది. శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను జూలై 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ-సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డీప్ కోసం జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ సేవా టిక్కెట్లు పొందిన భక్తులు జూలై 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీడిప్ టిక్కెట్ మంజూరు అవుతుంది.
కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టిక్కెట్లు జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టిక్కెట్లు జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు...
అంగప్రదక్షిణం టోకెన్లు జూలై 30వ తేదీ ఉదయం 10 గంటలకు...
శ్రీవాణి ట్రస్ట్ ఆన్‌లైన్ కోటా టిక్కెట్లు.. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు...
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి చికిత్స ప్రత్యేక దర్శనం టోకెన్లు.. జూలై 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు.
రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లు.. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు...
తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. తితిదే వెబ్‌సైట్‌లో https:///ttdevasthanams.ap.gov.in మాత్రమే శ్రీవారి అర్జిత సేవలు, దర్శనం టిక్కెట్లు, గదుల బుకింగ్ చేసుకోవాలని తితిది విజ్ఞప్తి చేసింది.