Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలియుగాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఏం చేయాలి?

Advertiesment
Lord Vishnu

సిహెచ్

, సోమవారం, 8 సెప్టెంబరు 2025 (19:35 IST)
ఉగాది గురించి మనకు తెలిసిందే. ఐతే హిందూ పంచాంగం ప్రకారం, ఒక సంవత్సరంలో నాలుగు యుగాదులు వస్తాయి. వాటిలో ఒకటి కలియుగాది. సెప్టెంబరు 19, 2025న కలియుగాది వస్తుంది. కలియుగాదిని శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టిన రోజుగా పరిగణిస్తారు. ఈ యుగంలో మానవ జీవితం క్లిష్టంగా ఉంటుందని, ధర్మం క్రమంగా క్షీణిస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ, భక్తి మార్గం ద్వారా మోక్షం పొందడం సులభమని చెబుతారు.
 
సెప్టెంబరు 19, 2025న కలియుగాది రోజున శ్రీమహావిష్ణువును, శ్రీకృష్ణుడిని పూజించడం అత్యంత శుభప్రదం. పేదలకు, అవసరం ఉన్నవారికి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ధర్మాన్ని పాటించడం, సత్యం మాట్లాడడం వంటి మంచి పనులను చేయాలని సంకల్పం చేసుకోవాలి.
 
కలియుగంలో భగవన్నామ స్మరణ మోక్షానికి సులభమైన మార్గం కాబట్టి, ఈ రోజున ఎక్కువ సమయం భగవంతుని నామాన్ని స్మరించడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రగ్రహణం: శుద్ధి కార్యాల తర్వాత ఏపీ-తెలంగాణల్లో తెరుచుకున్న దేవాలయాలు