Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుడ్లగూబ శుభ సూచకమా?

గుడ్లగూబ శుభ సూచకమా?
, సోమవారం, 8 ఏప్రియల్ 2019 (19:09 IST)
పెద్ద పెద్ద కళ్లతో, వంకర ముక్కుతో భయంకరంగా ఉండేది గుడ్లగూబ. దాని ఆకారం చూస్తే చాలా మంది భయపడటం సహజం. అది ఇంట్లోకి వచ్చినా, ఇంటిపై వాలినా, ఎదురు వచ్చినా, పరిసరాలలో తిరిగినా అశుభ సూచకమని చాలా మంది విశ్వాసం. అందుకే చాలా మంది అది వాలిన ఇంటి నుండి కాపురం చేయకుండా మరో ఇంటికి వెళ్లిపోతారు. ఇది కనిపించిన చోట పరిసరాలలో చావు కబురు వినవస్తుందనే అపోహ కూడా ప్రచారంలో ఉంది. 
 
ఇలాంటి వారి మాట నమ్మినట్లయితే పప్పులో కాలేసినట్లే అని గమనించండి. శాస్త్రం ప్రకారం గుడ్లగూబ శుభ సూచకం. ఇది లక్ష్మీ దేవి వాహనం. లక్ష్మీదేవి స్వామి వారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడిని, ఒంటరిగా ప్రయాణం చేయవలసినప్పుడు గుడ్లగూబను అధిరోహిస్తుంది. ఉల్లూక తంత్రంలో గుడ్లగూబ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది. రాత్రి నాల్గవ జాములో గుడ్లగూబ ఎవరింటిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. 
 
పనిమీద బయటకు వెళ్లేటప్పుడు గుడ్లగూబ ఎడమవైపు కనిపిస్తే కార్యం సిద్ధిస్తుంది. ఇంటి పరిసరాలలోగానీ, పశుశాలలోగానీ, పొలాలలో చెట్లపైగానీ గుడ్లగూబ నివాసం ఉంటే, యజమానికి సిరిసంపదలు, సుఖసంతోషాలకు కొదువ ఉండదట. అంధకారంలో ధైర్య సాహసాలతో పయనించే పక్షి గుడ్లగూబ. ఆహారం కోసం ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణంలో ప్రయాణిస్తుంది. 
 
ప్రశాంతంగా ధైర్య సాహసాలను ప్రదర్శించి ముందడుగు వేస్తే వారిని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఈ పక్షికి ఉదయం సరిగ్గా కనపడదు. అందుకే రాత్రి సమయంలో ప్రయాణిస్తుంది. అందుకే అమావాస్య రోజు లక్ష్మీ దేవికి మనం విశేష పూజలు చేస్తూ ఉంటాం. గుడ్లగూబ లేని ఖండం లేదు. ప్రపంచం అంతటా గుడ్లగూబ జాతి ఉంది. అడవుల్లో ఉండే ఈ పక్షులను ఉపాసన ద్వారా పరిశుభ్రమైన మన ఇంటికి ఆహ్వానించాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ రోజు తలస్నానం చేస్తే...?