Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రోజు తలస్నానం చేస్తే...?

ఈ రోజు తలస్నానం చేస్తే...?
, సోమవారం, 8 ఏప్రియల్ 2019 (14:35 IST)
తలంటు స్నానానికి వివాహాది శుభకార్యాలలో, పండుగలు మొదలగు రోజుల్లో తప్పక స్నానం చేయాలి. మామూలుగా అయితే తలంటు స్నానం చేయడానికి బహుళ అష్టమి, అమావాస్య, పూర్ణిమ, సంక్రమణాలు, మాసశివరాత్రులు, శుక్ల అష్టమి, ద్వాదశి, పాడ్యమి, షష్ఠి, చతుర్ధశి, శ్రాద్ధం రోజులు, ప్రయాణం రోజు, దీక్షామధ్యలో, అశ్విని, ఆర్ధ్ర, శ్రవణం, జ్యేష్ఠ, స్వాతి నక్షత్రాలలో, మంగళ, గురువారాలలో తగదు. ధనాన్ని కోరుకునేవారు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత తలస్నానం చేయాలి. మరి వారాల విషయానికి వస్తే.... 
 
ఆదివారం: ఈ రోజున తలస్నానం చేస్తే అందం తగ్గుతుంది. కలత, సంతాపం కలుగుతుంది. కానీ అవసరమైతే నూనెలో పువ్వులు వేసి తలంటుకుని తలస్నానం చేయవచ్చు. 
 
సోమవారం: ఈ రోజున తలస్నానం చేయడం అంత మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ చేస్తే కాంతి హీనత, భయం ఉంటుందట.
 
మంగళవారం: ఈ రోజు తలస్నానం చేస్తే విరోధం, అపాయం, ఆయుఃక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది.
 
బుధవారం: ఈ రోజు తలస్నానం చేస్తే అన్నివిధాలా శుభం.
 
గురువారం: అశాంతి, విద్యా లోపం, ధన వ్యయం, కీడు, శత్రు వృద్ధి. అవసరమైతే నూనెలో గరిక వేసి తలంటు స్నానం చేయాలి. 
 
శుక్రవారం: ఈ రోజున తలస్నానం చేస్తే అశాంతి, వస్తునాశం, రోగప్రదం. కానీ కొందరు సౌఖ్యప్రదమని అంటారు.
 
శనివారం: ఈ రోజున తలస్నానం చేయడం వలన ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ, కుటుంబ సౌఖ్యం, భోగం, శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గృహానికి సున్నం వేయించకపోతే ఏమవుతుందో తెలుసా..?