సాధారణంగా గృహాన్ని నిర్మిస్తున్నామంటే.. వాస్తు ప్రకారం ఏ గది ఎక్కడ ఉండాలి.. గేటు ఎలా అమర్చాలి, కిటికీలు, ద్వారబంధాలు ఎన్ని ఉండాలని తెలుసుకుంటాం.. అలానే గృహానికి రంగుల విషయంలోనూ కొన్ని సూత్రీకరణలు చేశారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం..
1. ఇంటికి తెలుపు రంగు మించింది మరొకటి లేదు. కానీ, తెలుపు త్వరగా మాసిపోతుందని కొందరికి తెలుపు రంగు అంటే అంతగా ఇష్టం ఉండదు.
2. గృహానికి తెలుపు, గోధుమరంగు, చాక్లెట్ రంగు, లేత నీలం రంగు, లేత ఆకుపచ్చ రంగు వంటివి ఉపయోగించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇవి చూడగానే హాయిగా అనిపిస్తాయి. మనసును ఆకట్టుకుంటాయి.
3. ఇంటికి అప్పుడప్పుడూ సున్నం వేయించకపోతే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాదు, ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. అలానే ఆదాయం పరంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. చివరికి చేపట్టిన పనులు కలిసిరావని వాస్తు నిపుణులు చెప్తున్నారు. కనుక అప్పుడప్పుడు ఇంటికి సున్నం వేయించుకోవడం మరచిపోకండి.
4. ఇళ్ళకే కాకుండా షాపులు, వ్యాపార సంస్థలకు కూడా తరచు సున్నం వేయిస్తూ ఉండాలి. కనీసం రెండు సంవత్సరాల ఓసారి రంగులు వేయించాలి. లేకుంటే ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు.