కాశ్మీరు పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఖండించింది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు, భారత్ అనుసరించే ఆత్మరక్షణ పద్ధతులకు తమ మద్దతు పూర్తిగా వుంటుందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఫోనులో భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో మాట్లాడారు.
ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమర జవానుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పటికైనా పాకిస్తాన్ తమ భూభాగం నుంచి ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ముష్కరులపై కఠిన చర్యలు తీసుకుని వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం వుందని అన్నారు.