Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళసూత్రానికి నల్లపూసలు ధరిస్తే?

సహజంగానే స్త్రీలకి వివిధ రకాల ఆభరణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు ఆయా రకాల ఆభరణాల పట్ల మక్కవ పెంచుకుంటారు. లేదంటే నల్లపూసల తాడుతోనే సరిపెట్టుకుంటారు. స్త్ర

మంగళసూత్రానికి నల్లపూసలు ధరిస్తే?
, శనివారం, 14 జులై 2018 (15:33 IST)
సహజంగానే స్త్రీలకి వివిధ రకాల ఆభరణాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు ఆయా రకాల ఆభరణాల పట్ల మక్కవ పెంచుకుంటారు. లేదంటే నల్లపూసల తాడుతోనే సరిపెట్టుకుంటారు. స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీన కాలం నుండి పాటిస్తున్నారు.
 
నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా, పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగాని, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతుంటారు. 
 
అయితే నల్లపూలస ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే నీలలోహిత గౌరి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు యెుక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
 
నీలలోహిత గౌరిని పూజించడం వలన ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకు సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అందువలన నల్లపూసలను ఒక ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా వాటిని మంగళ సూత్రంతో కూడి ఉండాలని శాస్త్రం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయం ఐదు రోజులు కాదు.. తొమ్మిది రోజులు మూతపడనుందట..