Publish Date: Sat, 17 Oct 2020 (19:02 IST)
Updated Date: Sat, 17 Oct 2020 (19:03 IST)
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, గదతో దామోదర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, శ్రీ చిప్పగిరి ప్రసాద్, శ్రీ గోవిందహరి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జగన్‌మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.