ఇతరులను చెడు పనుల నుంచి నివారించడం, మంచి పనులను చేయడానికి ప్రోత్సహించడం, ఇతరుల రహస్యాలను కాపాడటం, పరుల యొక్క సద్గుణాలను ప్రశంసించడం, తమను ఆశ్రయించినవారిని మాత్రమే కాకుండా ఆపదలో వున్న కాలంలో ఎవరినైనా విడువకుండా వుండటం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆ పనులకు అవసరమైనవి అందించడం ఇవి మంచి మిత్రులకు వుండే లక్షణాలు.
మంచి మిత్రులు ఎప్పుడూ పాలలో నీరు కలిసిపోయినట్లు ఒకరినొకరు విడువకుండా కలిసిమెలసి వుంటారు. ఒకరి గుణాలు ఒకరు అవలంభించి ఇద్దరూ ఒకటే అన్నట్లుగా మెలగుతారు.