Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్ స్ట్రోక్ లేదా వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలు... (video)

summer effect
, సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:29 IST)
హీట్‌స్ట్రోక్ లేదా వడదెబ్బ అనేది శరీరం వేడెక్కడం వల్ల ఏర్పడే పరిస్థితి. సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలకి ఎక్కువసేపు గురికావడం లేదా శారీరక శ్రమ ఫలితంగా శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్ హీట్ లేదా 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు ఈ అత్యంత తీవ్రమైన వడదెబ్బ లేదా హీట్‌స్ట్రోక్ సంభవించవచ్చు. వేసవి నెలల్లో ఈ పరిస్థితి కొందరికి వస్తుంది.

 
దీర్ఘకాలిక గుండె- మూత్రపిండ వ్యాధులు, స్ట్రోక్ బాధితులు, మధుమేహం, రక్తపోటు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు వడదెబ్బకు అనారోగ్యం బారిన పడే అవకాశం వుంటుంది. హీట్ వేవ్‌కు గురైనట్లయితే, వారి ప్రధాన శరీర ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి వేగంగా పెరుగుతాయి.

 
శరీర ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత, శరీరంలోని ఇతర వ్యవస్థలపై అది ప్రభావం చూపుతుంది. ఇది వికారం, వాంతులు, విరేచనాలు, దిక్కుతోచని స్థితి, మైకము, అలసట, చివరికి శరీరంలోని మొత్తం అవయవాలు నీరసించిపోయి డస్సిపోతారు. గతంలో వడదెబ్బ కారణంగా మరణించినవారిలో ఎక్కువమంది ఇతర అనారోగ్య సమస్యలను కలిగివున్నట్లు తేలింది.
 

 
అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. సన్ స్ట్రోక్ సమయంలో డీహైడ్రేషన్ వల్ల రక్తంలో యూరియా ఏర్పడుతుంది. ఇది రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు తమను తాము హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

 


 
ఆరోగ్యానికి విపరీతమైన బహిర్గతమైపోయే సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్, విటమిన్‌లతో సహా శరీరంలోని ముఖ్యమైన ఖనిజాల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, మెదడు పనితీరుపై ప్రభావం కారణంగా, సన్ స్ట్రోక్ బాధితులు మైకం వచ్చినట్లుగా మారిపోయి మూర్ఛిల్లే అవకాశం వుంటుంది.

 
ప్రారంభ దశలో వున్నప్పుడు రికవరీ ఆసుపత్రిలో సుమారు 1-2 రోజులు పడుతుంది. అవయవ నష్టం గుర్తించినట్లయితే ఎక్కువ కాలం పడుతుంది. హీట్ స్ట్రోక్- అంతర్గత అవయవాలపై దాని ప్రభావాలు పూర్తిగా కోలుకోవడానికి 2 నెలల లేదా అంతకంటే ఎక్కువరోజులు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్వాన్స్‌డ్ గ్రో హెయిర్ క్లినిక్‌ని ప్రారంభించిన నటి ఉమా రియాజ్ ఖాన్