Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యంగా వుండాలంటే...

Water
, శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (19:27 IST)
వేసవి ఎండలకు వడదెబ్బ, ఎండ సంబంధిత అనారోగ్యాలు సాధారణంగా తలెత్తే వేసవి సమస్యలు. పెరిగిపోతుండే పల్స్ రేటు, మైకం, అలసట, కండరాల తిమ్మిరి, వికారం, తలనొప్పి వంటి అనేక లక్షణాలతో వేసవి వల్ల కలిగే వడదెబ్బ వస్తుంది.

 
ఈ అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పిల్లలు, వృద్ధులు, అధిక ఉష్ణోగ్రతలకు అలవాటుపడని వ్యక్తులు వేసవి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో బహిరంగ శారీరక కార్యకలాపాలను చేయాలి. మధ్యాహ్నం సమయంలో అధిక-తీవ్రత కార్యకలాపాలను చేయకూడదు. తేలికైన, వదులుగా వుండే బట్టలు ధరించాలి.

 
వేసవిలో తలెత్తే మరో సమస్య డీహైడ్రేషన్. వయస్సును బట్టి డీహైడ్రేషన్ లక్షణాలు మారవచ్చు. డీహైడ్రేషన్‌ సమస్యతో వున్న పెద్దలు అలసట, దాహం అనుభూతి కనబడుతుంది. మైకం, గందరగోళంగా అనిపిస్తుంది. ముదురు రంగులో మూత్రం వస్తుందంటే తగినంత నీరు తాగడం లేదని సంకేతం. అందుకే తరచుగా మంచినీళ్లు తాగాలి. పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు, టమోటాలు, దోసకాయ, సెలెరీ మరియు పాలకూర వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాన్ని కూడా తినవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జామకాయంత సైజులో స్త్రీ గర్భాశయం, ఆ విషయంలో స్త్రీ పాత్ర వుండదు