మీకు నేను ఒక తారకమంత్రం ఉపదేశిస్తున్నాను. మీ మనస్సు ఊగిసలాడుతున్నప్పుడుగాని ఏదయినా సంక్షోభంలో ఇరుక్కున్నప్పుడు గాని క్రింది విషయాన్ని గుర్తుంచుకోండి.
మీ జీవితంలో మీకు తారసపడిన దరిద్రుణ్ణి, బలహీనుణ్ణి ఒకసారి తలచుకోండి. అప్పుడు మీరు వేయబోయే అడుగు అతనికేమైనా ప్రయోజనం వుందా...? అతని జీవితమూ జీవిత ధ్యేయమూ సఫలీకృతమవుతుందా? ఆకలిగా వున్నవానికి గాని నైరాశ్యం వల్లగాని కుంగిపోతున్న వానికి గాని ఉపశమనం ఏమయినా కలుగుతుందా? అని ప్రశ్నించుకోండి.
వీటికి సరైన సమాధానం లభించినప్పుడు మీ ఊగిసలాట సందిగ్ధావస్థాన మబ్బులా తొలగిపోయి మనసు కుదుటపడి మీకు ప్రశాంతి లభిస్తుంది.