Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భక్తి అంటే ఏంటో తెలుసా..?

భక్తి అంటే ఏంటో తెలుసా..?
, బుధవారం, 17 ఏప్రియల్ 2019 (13:35 IST)
భక్తి అంటే ఓ పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది. భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగ పేర్కొన్నది. భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
 
1. శ్రవణ భక్తి: ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వానం పెరుగుతుంది. 
2. కీర్తనా భక్తి: భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోవడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది.
3. స్మరణ భక్తి: భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకుని స్మిరించుట స్మరణ భక్తి. 
4. పాదసేవన భక్తి: భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. 
5. అర్చన భక్తి: ప్రతిరోజూ తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి.
6. వందన భక్తి: వందనం అనగా నమస్కారం. తన యందు మనసు నుండి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించారు.
7. దాస్య భక్తి: ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. 
8. సఖ్య భక్తి: సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. 
9. ఆత్మ నివేదన భక్తి: ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండవచ్చా..?