Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రివేళల్లో చెత్తని ఇలా వేస్తున్నారా..?

Advertiesment
రాత్రివేళల్లో చెత్తని ఇలా వేస్తున్నారా..?
, గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:57 IST)
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఓ కళ. ప్రస్తుతం మహిళలు సైతం పురుషులకు పోటీగా ఉద్యోగాలకు వెళ్లడం ద్వారా ఏపనికి వేళా పాళా అంటూ లేకుండా పోయింది. సమయం దొరికినప్పుడల్లా పని చేసేసుకోవడంలోనే మహిళలు శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆచార వ్యవహారాలను సైతం పక్కనబెట్టేస్తున్నారు. కానీ సమయం లేదంటూ రాత్రివేళ ఇళ్లంతా శుభ్రం చేసి చెత్తను బయట వేసే వారు మీరైతే ఈ స్టోరీ చదవండి. 
 
సాధారణంగా ఉదయాన్నే ఇల్లు ఊడ్చి ఆ చెత్తను బయట పారవేసి శుభ్రం చేసిన తరువాత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలానే సాయంత్రం కూడా ఇంటిని ఊడ్చిన తరువాత పూజ గదిలో దీపారాధన చేస్తుంటారు. ఇక చాలామంది తీరిక లేదంటూ రాత్రి సమయాల్లో ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఆ చెత్తను అవతల పారేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయడం తప్పని శాస్త్రం చెబుతోంది.
 
లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో వస్తుందనే విశ్వాసం చాలామందిలో వుంది. ఆ సమయంలో ఆమెకి చెత్త పట్టుకుని ఎదురు పడకూడదనే ఉద్దేశంతోనే, రాత్రి వేళల్లో చెత్తను బయటవేయరాదని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-04-2019 గురువారం దినఫలాలు - కర్కాటక రాశివారు వేళ తప్పి భుజిస్తే...