దీపం జ్యోతిః పరబ్రహ్మః
దీపం జ్యోతిర్ జనార్దనః
దీపో హరతి మే పాపం
సంధ్యా దీప నమోస్తుతే
అర్థం:
దీపం జ్యోతిః పరబ్రహ్మః- దీపం యొక్క జ్వాల (వెలుగు) పరబ్రహ్మ స్వరూపం.
దీపం జ్యోతిర్ జనార్దనః- దీపం యొక్క జ్వాల జనార్దనుడు (విష్ణుమూర్తి) స్వరూపం.
దీపో హరతి మే పాపం- ఈ దీపం నా పాపాలను తొలగిస్తుంది.
సంధ్యా దీప నమోస్తుతే- సాయంకాలపు దీపమా! నీకు నమస్కరిస్తున్నాను.