పురాణాల ప్రకారం ఒక రోజుకు సంబంధించిన 24 గంటల్లో ఒకటిన్నర గంట రాహువు, ఒకటిన్నర గంట కేతువు అంబికను అంటే అమ్మవారిని పూజిస్తాయి. అందులో రాహువు అమ్మవారిని పూజించే సమయాన్ని రాహుకాలంగా, కేతువు అమ్మవారిని పూజించే సమయాన్ని యమగండంగా పిలుస్తారు. రాహుకాలంలో ఇతర గ్రహాల ప్రభావం తగ్గి వుండటం కారణంగా ఆ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు.
అలాగే రాహు కాలంలో దుర్గాదేవిని పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. వారంలో మంగళవారం, శుక్రవారాల్లో వచ్చే రాహుకాలంలో దుర్గాదేవి పూజ ద్వారా ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయి.
రాహు దోషాలున్నవారు.. మంగళవారం పూట రాహుకాలంలో దీపం వెలిగించడం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. కానీ రాహుకాలం అనేది పూజకు మాత్రమే విశేషం. ఆ సమయాన్ని ఇతర శుభకార్యాలకు ఉపయోగించడం కూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.