Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పులు తొలగిపోవాలంటే.. యోగ నరసింహ స్వామికి?

అప్పులు తొలగిపోవాలంటే.. యోగ నరసింహ స్వామికి?
, మంగళవారం, 16 జులై 2019 (16:25 IST)
కలియుగంలో కార్యసిద్ధికి దుర్గాదేవిని ఆరాధించాలి. మంగళవారం దుర్గాదేవికి రాహుకాలం సమయంలో నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రాహుకాలంలో చివరి అరగంటను అమృతఘడియలు అంటారు. ఆ సమయంలో దుర్గమ్మకు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపమెలిగించడం ద్వారా సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. 
 
ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల్లోపు దుర్గకు దీపం వెలిగించడం ద్వారా సకలాభీష్టాలు నెరవేరుతాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, రుణాల బాధను తొలగించుకోవాలంటే.. ప్రశాంతత చేకూరాలంటే చేయాల్సిందంతా.. సమీపంలోని ఆలయంలో నేతి దీపం వెలిగించాలి. 
 
రుణ బాధలు మితిమీరినట్లైతే.. శ్రీ యోగ నరసింహ స్వామిని పూజించాలి. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. లక్ష్మీ నరసింహ స్వామిని ఏ అవతారంలోనైనా పూజించినా.. అర్చించినా.. ఆర్థిక ఇబ్బందులు వుండవు. కంటి దృష్టి బాధలుండవు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. 
 
అలాగే యోగ నరసింహ స్వామిని మంగళవారం పూట నేతితో దీపం వెలిగించడం ద్వారా ఇచ్చిన రుణాలు చేతికి అందుతాయి. అలాగే కాలభైరవునికి 8 మంగళవారాల్లో నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా ఇచ్చిన రుణాలను తిరిగి పొందవచ్చును. మంగళవారం నేతి దీపంతో పాటు సహస్ర నామ అర్చన చేయించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి. 
 
అంతేగాకుండా శివాలయాల్లో వుండే బిల్వ వృక్షాన్ని 21 సార్లు ప్రదక్షణలు చేసి.. ఇబ్బందులు విన్నవిస్తే.. మంచి ఫలితాలు వుంటాయి. ప్రదోషకాలంలో వృషభ రూఢ మూర్తిగా, మహేశ్వరుడు ఉమాదేవితో దర్శనమివ్వడాన్ని వీక్షిస్తే.. వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితం వుంటుంది. 
 
ఇంకా ఈశాన్య దిశలో ఈశ్వరుని సమర్పించే దీపాన్ని తిలకిస్తే సమస్త వ్యాధులు తొలగిపోతాయి. ఇంకా శ్వేతార్కంతో చేసిన వినాయకుడిని ఇంటి ప్రధాన గుమ్మానికి పైన చేతికి అందని చోట వుంచితే కంటి దృష్టి దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

150 ఏళ్లకోసారి అరుదైన చంద్రగ్రహణం... ఆ రాశివారి పైన ఎఫెక్ట్... ఏం చేయాలి?