Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూజగదిలో రాగి చెంబులో నీరు..? ఇనుము పాత్రలుంటే? (video)

పూజగదిలో రాగి చెంబులో నీరు..? ఇనుము పాత్రలుంటే? (video)
, సోమవారం, 3 జూన్ 2019 (20:12 IST)
ప్రతిరోజూ పూజకు ముందు స్వామికి నైవేద్యంగా శుభ్రమైన పండ్లు, ఆహార పదార్థాలను వుండవచ్చు. అలాగే నైవేద్యాన్ని పూజాగదిలోని దేవతలకు సమర్పించడం కోసం రాగి చెంబు పాత్రలో నీటిని నింపి వుంచడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
పూజగదిలో కుండలోనూ, చెంబు పాత్రల్లోనూ నిండుగా నీటిని వుంచాలి. పూజ చేసేటప్పుడు కాసేపు ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో ఇష్టదేవతను స్తుతించాలి. ఇష్టదేవతా మూలమంత్రాన్ని పఠించాలి. అలా మీరు చెప్పే ఆ మంత్ర సానుకూలత చెంబులో మనం పెట్టే నీటిలో ఆవహిస్తుంది. అందుకే పూజకు అనంతరం.. పూజ కోసం కుండల్లో, రాగి పాత్రల్లో వుంచిన నీటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. 
 
పూజ ముగిసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత రాగి చెంబులోని నీటితో మూడు సార్లు.. పూజగదిలో దేవతలు కర్పూర హారతిని స్వీకరించమన్నట్లు నీటిని భూమిపై పోయాలి.

పూజ పూర్తయిన తర్వాత రాగి పాత్రల్లోని నీటిని తులసీ కోట పోసి కొత్త నీటిని నింపి పూజగదిలో వుంచాలి. ఇలా పూజకు ముందు రాగి చెంబులోని నీటిని తులసీ కోటలో పోయడం.. కొత్త నీటితో మళ్లీ దేవతలకు నైవేద్యాన్ని సమర్పించడం చేస్తే ఇంట్లోని దుష్టశక్తులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. 
 
రాగి లేదా కుండల్లో పూజగదిలో వుంచే పాత నీటితోనే మళ్లీ నైవేద్యం సమర్పించడం కూడదు. పూజ చేసేటప్పుడు గంట కొట్టడం ద్వారానూ దుశక్తులు ఇంటి నుంచి వెలుపలికి వెళ్లిపోతాయని విశ్వాసం. రోజూ గంట కొట్టి పూజ చేసేవారింట శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం, సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. 
webdunia
 
కానీ పూజగదిలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుముతో కూడిన వస్తువులను ఉపయోగించకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇనుముకు యముడు అధిపతి. అందుచేత ఇనుముతో చేసిన విగ్రహాలు, పాత్రలు పూజగదిలో వుండకుండా చూడాలని వారు సూచిస్తున్నారు. ఇనుము ప్రతికూల ఫలితాలను ఇస్తుందని.. వెండి, ఇత్తడి, మట్టితో చేసిన వస్తువులను, పూజా ప్రతిమలను ఉపయోగించవచ్చునని.. పండితులు సెలవిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-06-2019 మీ దినఫలాల : అవివాహితులకు త్వరలోనే...