మంచి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజులో వీలైనంత వరకు నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీంతో చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. అందులోనూ చాలా చల్లగా ఉండే నీటిని తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఎండకాలంలో అయితే దాహంగా ఉందని ఫ్రిజ్‌లో నుండి తీసిన నీటిని, అలాగే గడ్డకట్టిన నీటిని తాగుతుంటారు.
ఇలా మరీ చల్లగా ఉండే నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వేడి నీటి వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అదే చల్లటి నీరు అయితే చర్మ రంధ్రాలు మూసుకుపోతుంటాయి. మామూలుగా చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణాశయం కుచించుకుపోతుంది. అంతేకాదు చల్లటి నీరు జీర్ణమై రక్తంలో కలిసే వేగం తగ్గుతుంది. దీని కారణంగా ఒక్కోసారి డీహైడ్రేషన్‌కి గురవుతుంటాం.
భోజనం చేస్తున్నప్పుడు లేదా తిన్న తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారంలోని కొవ్వుపదార్థాలు గడ్డకట్టుకుపోతాయి. దీంతో జీర్ణాశయం స్థాయికి మించి పని చేయవలసి ఉంటుంది. కాబట్టి చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.