Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం.. సత్య నారాయణ పూజ చేస్తే? (వీడియో)

Advertiesment
Magha Purnima
, బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:57 IST)
మాఘ పూర్ణిమ ఈశ్వరుని అర్థాంగి సతీదేవి జన్మించిన రోజు. మాఘ పౌర్ణిమ సముద్ర స్నానానికి ఉత్తమమైన రోజు. సాధారణంగా కార్తీక పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణమి, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమల్లో సముద్ర స్నానం ధర్మబద్ధమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ నాలుగింటిలో మాఘ పౌర్ణిమ సముద్ర స్నానానికి మరింత విశేషం. 30 కుడుములను దానంగా ఇవ్వాలి లేదా నువ్వులు, బెల్లం కలిసి దంచి కట్టిన వుండలను దానంగా ఇవ్వడం చేయాలి. 
 
మాఘ మాసం పాపాలను తొలగించేది. ఇంకా పుణ్య ఫలాలను సంపాదించేందుకు మాఘ మాసం తోడ్పడుతుంది. పాపాలను, శాపాలను, దోషాలను ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే సముద్ర స్నానం తొలగిస్తుంది. మాఘ పురాణం అనేది పద్మపురాణంలో వుంది. ఈ మాసం మాఘ పురాణం వినాలి. అందుకే సంకల్పంతో మాఘ స్నానం చేయాలి. భీష్మస్తుతి చదవాలి. మాఘ మాసంలోనే భీష్ముడు ఆత్మ సమర్పణ చేశారు. 
 
అందుకే సముద్ర స్నానం చేసి, నువ్వులు, బియ్యం, బెల్లంను దానం చేయాలి. పౌర్ణమి రోజున చంద్రుని కారకంగా మనస్సు ఆహ్లాదకరంగా వుంటుంది. మనస్సు, శరీరం, వాక్కు చేసిన పాపాలను మాఘ సముద్ర స్నానం తొలగిస్తుంది. మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం చేసేటప్పుడు గోవింద నామ స్మరణ చేయడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. మహా కుంభమేళలో స్నానాలు చేయడం కూడా చేయొచ్చు. గంగాస్నానం విశేషమని పండితులు చెప్తున్నారు. 
 
మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున నదీ, సముద్ర స్నానం కుదరకపోతే.. గృహంలోని నీటినే గంగా తీర్థంగా భావించి స్నానం చేయాలి. ''గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు'' అంటూ పలికి ఆ నీటిని 12 సార్లు ఓం అని అభిమంత్రించి.. ఆ పిమ్మట గోవింద గోవింద అంటూ స్నానం ఆచరించడం ద్వారా దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్నానం చేయడం ద్వారా మనస్సు పరిశుధ్ధం అవుతుంది. ఇంకా భీష్మాచార్యుల వారికి తర్పణం విడిచిపెట్టాలి. ఇలా చేస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
 
భీష్మ నిర్యాణం తర్వాత వచ్చే పూర్ణిమ మాఘ పౌర్ణిమ కనుక ఆయనను స్మరించుకోవాలి. తర్పణం వదలాలి. తిలలు, చెప్పులు, గొడుగులు, బియ్యం, ఉండ్రాళ్లు దానం చేయవచ్చు. ఈ రోజున సువాసిని పూజ చేస్తే ఏడు జన్మల వరకు మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది. పసుపు, కుంకుమలు ఏడు జన్మల వరకు ధరించే అదృష్టం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున సత్య నారాయణ వ్రతం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భీష్మ ఏకాదశి రోజున ''విష్ణు సహస్రనామస్తోత్రం'' పఠిస్తే..?