సంఖ్యశాస్త్రం ప్రకారం పుట్టిన మాసాన్ని పరిగణనలో తీసుకుని వారి స్వభావాన్ని చెప్పవచ్చు. మహిళలు పుట్టిన మాసాన్ని బట్టి గుణగణాలన తెలుసుకోవడం సులభం. ఒక ఆడ శిశువు ఏ మాసంలో పుట్టిందనే దానిని బట్టి.. ఆమె స్వభావాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు.
జనవరి:
సంఖ్యాశాస్త్రం ప్రకారం జనవరి నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు. బుద్ధిమంతురాలుగా వుంటారు. వీరికి రకరకాల దుస్తులు ధరించడం అంటే ఇష్టం. ఈ మాసంలో పుట్టిన ఆడపిల్లలు ఏ విషయంలోనైనా ధీటుగా రాణిస్తారు. సమస్యలను అధిగమించడంలో దిట్ట. కానీ వీరు వ్యాపారంలో రాణించగలరు.
ఫిబ్రవరి:
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఫిబ్రవరిలో పుట్టిన వారికి బుద్ధికుశలతలు అధికం. ఇతరుల ముందు ఎలా ప్రవర్తించాలో వీరికి బాగా తెలుసు. పరిస్థితికి తగినట్లు ప్రవర్తించడం వీరి నైజం. వీరికి స్నేహితులు ఎక్కువ. అవసరం అనే చోట మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. అనవసరంగా డబ్బు వృధా చేయరు. స్వేచ్ఛగా వుండాలనుకుంటారు.
మార్చి:
మార్చి నెలలో జన్మించిన జాతకులు, సహజంగా సున్నిత స్వభావం కలిగివుంటారు. వీరికి శత్రువులు తక్కువ. ఇతరుల పట్ల ప్రేమగా వుంటారు. నిజాయితీగా వుండాలనుకుంటారు. రహస్యాలను దాచిపెట్టడంలో వీరు దిట్ట. ఇతరుల విషయాలను ఇతరుల వద్ద పొక్కరు.
ఏప్రిల్:
ఏప్రిల్‌లో పుట్టిన మహిళలకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇతరుల పట్ల ప్రేమగా వుంటారు. బంధువులు, స్నేహితులు ఎక్కువ. వీరికి మొండితనం ఎక్కువ.
మే :
మే నెలలో పుట్టిన జాతకులు సంఖ్యాశాస్త్రం ప్రకారం పట్టుదల కలిగిన వారుగా వుంటారు. ఆత్మబలం, మనోబలం అధికంగా కలిగివుంటారు. కోపం, ఆవేశం ఎక్కువ.
జూన్:
సంఖ్యాశాస్త్రం ప్రకారం జూన్‌లో జన్మించిన జాతకులు ఉన్నత చదువులు అభ్యసిస్తారు. ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తారు. వీరికి విహార యాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం.
జూలై:
ఇక జూలైలో జన్మించిన మహిళలు ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తారు. నిజాయితీగా వుంటారు. ఇతరులను సులభంగా అర్థం చేసుకోగలరు. క్షమాగుణం ఎక్కువ. అయితే ఇతరులు చేసిన కీడును అంత సులభంగా మర్చిపోరు.
ఆగస్టు:
ఆగస్టులో జన్మించిన జాతకులు.. ధైర్యంగా వుంటారు. ఎంతటి కార్యాన్నైనా సాధించలగరు. ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు. గంభీరంగా మాట్లాడే నైజం వీరిది. సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ.
సెప్టెంబర్:
సెప్టెంబర్‌లో జన్మించిన మహిళలు సంఖ్యాశాస్త్రం ప్రకారం.. తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఆపై బాధపడుతుంటారు. మనోధైర్యం వీరికి ఎక్కువ. సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఆ సమస్యను పరిష్కరించేంతవరకు వదిలిపెట్టరు.
అక్టోబర్:
అక్టోబర్ నెలలో జన్మించిన జాతకులు, బుద్ధికుశలతతో అన్నీ రంగాల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇతరులు కఠినంగా, పరుషంగా మాట్లాడితే తట్టుకోలేరు.
నవంబరు:
నవంబరులో జన్మించిన జాతకులు.. తమ రహస్యాల అంత సులభంగా బయటపెట్టరు. చేసే పనిలో నిబద్ధతతో వుంటారు. ఇతరుల కోసం తక్కువగా ఆలోచిస్తారు. స్వయంగా రాణించాలనే అంశంపై అధికంగా దృష్టి పెడతారు.
డిసెంబర్:
డిసెంబర్‌లో పుట్టిన మహిళలు సంఖ్యాశాస్త్రం ప్రకారం.. లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నిరంతరంగా శ్రమిస్తారు. ఇతరులపై ప్రేమగా, ఆప్యాయతగా వుండే ఈ జాతకులు ఇతరుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటారు.