Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

Advertiesment
daily horoscope

రామన్

, శనివారం, 25 అక్టోబరు 2025 (04:02 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. సన్నిహితులు ప్రోత్సాహిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ఫలిస్తాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడతాయి. గుట్టుగా మెలగండి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకున్నది సాధిస్తారు. పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు ప్రయోజనకరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు అధికం. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. వాగ్వాదాలకు దిగవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహాసంచారం బాగుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీలు ముగుస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అధికం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. కొత్త యత్నాలు మొదలెడతారు. గుట్టుగా మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను అధిగమిస్తారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. సాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పనులు ఒక పట్టాన సాగవు. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం