మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కష్టం ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు ముందుకు సాగవు. మీ సిఫార్సుతో ఒకరికి మేలు జరుగుతుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఓర్పుతో శ్రమిస్తే విజయం తథ్యం. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మీ వాక్కు ఫలిస్తుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. వ్యతిరేకులతో జాగ్రత్త. ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
సమర్ధతను నిరూపించుకుంటారు. యత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభసమయం ఆసన్నమవుతోంది. ఉత్సాహంగా యత్నాలు కొనసాగించండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. విమర్శలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. ప్రలోభాలకు లొంగవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రయాణం తలపెడతారు.