మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఊహించని సమస్య ఎదురవుతుంది. సోదరులను సంప్రదిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ జోక్యం అనివార్యం. పనులు మందకొడిగా సాగుతాయి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు కొలిక్కివస్తాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనుల అస్తవ్యస్తంగా సాగుతాయి. కీలక పత్రాలు సమయానికి లభ్యం కావు. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారదక్షతతో రాణిస్తారు. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆత్మస్థైర్యంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు వేధిస్తాయి. ప్రయాణం వాయిదా పడుతుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు అదుపులో ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక సమావేశాశంలో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయప్రతికూలతలు అధికం. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. పనులు ముందుకు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంకల్పం సిద్ధిస్తుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. ధనసహాయం తగదు. పనుల్లో ఒత్తిడి అధికం. దంపతుల మధ్య దాపరికం తగదు. వేడుకకు హాజరవుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. మీ సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఖర్చులు అధికం, దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కృషికి పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. అపజయాలకు కుంగిపోవద్దు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆప్తుల గురించి ఆందోళన చెందుతారు.