Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

Advertiesment
Astrology

రామన్

, ఆదివారం, 26 అక్టోబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయక వీలుపడదు. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆపన్నులకు సాయం అందిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పత్రాలు అందుకుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మాటతీరు ఆకట్టుకుంటుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు సాగవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పిల్లల దూకుడు అదుపుచేయండి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు ఒక పట్టాన సాగవు. నోటీసులు అందుకుంటారు. మీ సహాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు నిలకడగా ఉండవు. చీటికి మాటికి అసహనం చెందుతారు. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు సామాన్యం. వాగ్వాదాలకు దిగవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవకాశాలను దక్కించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధైర్యంగా వ్యవహరిస్తారు. మీ మనోబలమే శ్రీరామరక్ష. అపజయాలకు కుంగిపోవద్దు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పొగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. పనులు చురుకుగా సాగుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దైవదీక్షలు స్వీకరిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం