Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-07-2019 నుంచి 13-07-2019 వరకు మీ వార రాశిఫలాలు

webdunia
ఆదివారం, 7 జులై 2019 (16:04 IST)
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీదే పైచేయిగా వుంటుందియ ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనం సర్దుబాటు అవుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా వుండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సంతానం దూకుడును అదుపు చేయండి. సన్నిహితులను కలుసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు, ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ, పుణ్య కార్యంలో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.  
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. గురు, శుక్రవారాల్లో పనులు సాగవు. మీ జోక్యం అనివార్యం. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. అత్యుత్సాహం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వాహన చోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.  
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శనివారం నాడు పనులు సాగక విసుగు చెందుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష  
పరిస్థితులు క్రమంగా పెరుగుతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఆది, సోమవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సానుకూలమవుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఆధ్యాత్మిక, యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆర్థిక స్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. అహంకారం, అభిజాత్యం తగవు. బుధవారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. విద్యావకాశం లభిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. న్యాయ సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవ కార్యంలో పాల్గొంటారు.
 
కన్య : ఉత్తర 2, 3 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. 
మాటతీరుతో ఆకట్టుకుంటారు. వ్యవహారానుకూలత వుంది. సమస్యలు సద్దుమణుగుతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఖర్చులు అధికం. ధనం సర్దుబాటవుతుంది. పనులు సానుకూలమవుతాయి. గురు, శుక్రవారాల్లో ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పూర్వ విద్యార్థులు తారసపడతారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖథ 1, 2 3 పాదాలు.  
ప్రణాళికాబద్ధంగా వ్యవహారిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు భారమనిపించవు. ధనలాభం ఉంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. శనివారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభం. ఆత్మీయులకు వివాహ సమాచారం అందిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. న్యాయ, సేవా రంగాల వారికి ఆశాజనకం. దైవకార్యంలో  పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట  
ఓర్పుతో యత్నాలు సాగించండి. స్వయంకృషితో రాణిస్తారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. శకునాలు పట్టించుకోవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. పెట్టుబడులకు తరుణం కాదు. ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తి నీయవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే అవకాశం వుంది. ఒత్తిడి, శ్రమ అధికం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మంగళ, బుధవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. పనులు మొక్కుబడిగా  పూర్తి చేస్తారు. ఆలోచనలు నిలకడగా వుండవు. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య దాపరికం తగదు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలకు భిన్నంగా వుంటాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ధనసాయం అడిగేందుకు మనస్కరించదు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇవ్వకండి. 
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది వుండదు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పరిచయంలేని వారితో జాగ్రత్త. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి  
ఈ వారం కార్యసాధనలో జయం, వ్యవహారానుకూలత ఉన్నాయి. పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. తొందరపడి హామీలివ్వవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఖర్చులు అధికం. గృహం సందడిగా ఉంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి  పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

7-7-2019- ఆదివారం మీ రాశి ఫలితాలు.. మిమ్మిల్ని పొగిడే వారే కానీ?