మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
పట్టుదలతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు ఫలించవు. మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. అచితూచి వ్యవహరించాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆధిక్యత ప్రదర్శించవద్దు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. రుణ ఒత్తిళ్లు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు హోదా మార్పు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు విపరీతం. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పెట్టుబడులు అనుకూలించవు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్లు లాభిస్తాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. బంధువులు మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. వేడుకలు సన్నాహాలు సాగిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. ఆది, సోమవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరు వ్యాపారులకు సామాన్యం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం. పుష్యమి, ఆశ్లేష
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆప్తుల సాయం అందిస్తారు. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ జోక్యం అనివార్యం. పనులు సానుకూలంగా పూర్తవుతాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మంగళ, బుధవారాల్లో ఒక సంఘటన మీకు ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. వాహనం ఇతరులకివ్వొద్దు. దైవకార్యంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
వ్యవహారానుకూలత ఉంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సోమ, మంగళవారాల్లో నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వాగ్ధాటితో నెట్టుకొస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
సంప్రదింపులు అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. బుధవారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. విపరీతమైన ఖర్చులు, రుణ, ఒత్తిళ్లు. అప్రమత్తంగా ఉండాలి. మనస్సు స్థిమితంగా ఉండదు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో ఒడిదుడుకలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. సోమ, మంగళవారాల్లో డబ్బు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆధ్యాత్మిక పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. పరిచయాలు ఏర్పడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు విచారణకు రాగలవు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం అనూరాధ, జ్యేష్ట
గత తప్పిదాలు పునరావృతమవుతాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. నిరుత్సాహానికి గురవుతారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి రాబడిపై దృష్టిపెడతారు. అవసరాలు అతికష్టంమీద నెరవేరుతాయి. వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. ఆలోచనలు చికాకు పరుస్తాయి. పనులు ముందుకుసాగవు. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బుధవారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వేడుకలకు హాజరవుతారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది.
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం.
సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. కొత్త సమస్యలెదురవుతాయి. ఆత్మీయుల సలహా పాటించండి. అనవసర జోక్యం తగదు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. గురు, శుక్రవారాల్లో డబ్బు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్య నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. వేడుకల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాఢ 2, 3 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
స్వయంకృషితో రాణిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఆధిక్యత ప్రదర్శించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. శని, ఆదివారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. బంధువులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు.
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి పెట్టుబడులకు అనుకూలం. చెల్లింపులో మెలకువ వహించండి. పత్రాలు పస్తువుల పట్ల జాగ్రత్త. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానితావివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పనిభారం. విశ్రాంతి లోపం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఈ వారం ప్రతికూలతలు అధికం. బంధువులతో విభేదిస్తారు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు సామాన్యం. ధనానికి ఇబ్బంది ఉండదు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆప్తులను కలుసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త.