Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రోజు (30-11-2019) మీ రాశిఫలాలు - వాతావరణం అనుకూలించక...

ఈ రోజు (30-11-2019) మీ రాశిఫలాలు - వాతావరణం అనుకూలించక...
, శనివారం, 30 నవంబరు 2019 (08:24 IST)
మేషం : ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మీ పనులు అనుకూలంగా సాగవు. అయిన వారి నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు.
 
వృషభం : ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త పనులు చేపట్టే విషయంలో పోటీ అధికమవుతుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు, ఒత్తిడి వంటి చికాకులు ఎదురవుతాయి.
 
మిథునం : దైవ, పుణ్యకార్యాల్లో ఇతోధికంగా వ్యవహరిస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి మెళకువ అవసరం. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ఏకాగ్రత వహించినట్లైతే సత్ఫలితాలు పొందుతారు. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి ఉంటుంది. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకోని సదవకాశాలు లభిస్తాయి. సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది.
 
సింహం : కొబ్బరి, పండ్ల, పూల, హోటల్, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. బంధువుల రాక ఆనందాన్నిస్తుంది.
 
కన్య : బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం.
 
తుల : స్త్రీలపై సన్నిహితులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం నిరీక్షించవలసి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి.
 
వృశ్చికం : ఆర్థిక స్థితి ప్రోత్సాహకరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. ఆత్మీయులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వైద్యరంగాల వారికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
 
ధనస్సు : మీ సృజనాత్మకతతో మీరు కోరుకున్న రంగంలోకి ప్రవేశించేందుకు ఇది ఉత్తమమైన సమయం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తాయి. మొండిబాకీల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
మకరం : ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం అధికమవుతుంది. అవివాహితులకు కోరుకున్న సంబంధాలు నిశ్చయమవుతాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు.
 
కుంభం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లోని పనులు సానుకూలమవుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు వస్త్ర, ఆభరణాల పట్ల మక్కువ అధికమవుతుంది. నూతన వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాల బాటలో సాగుతాయి.
 
మీనం : బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. భాగస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గృహోపకరణాలు, వాహనం అమర్చుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!