Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగళవారం (26-11-2019 ) మీ రాశిఫలాలు

Advertiesment
మంగళవారం (26-11-2019 ) మీ రాశిఫలాలు
, మంగళవారం, 26 నవంబరు 2019 (10:40 IST)
మేషం : సందర్భానుసారంగా మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. శారీరకశ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం : స్త్రీలకు అనారోగ్యపరమైన సమస్యలు, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. మీ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్తపడండి. దైవ, వన సమారాధనల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది.
 
మిథునం : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనలు, జాబ్ ఏజెన్సీల పట్ల అప్రమత్తత అవసరం. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు అనవసర విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.
 
కర్కాటకం : సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కొంతమంది మీ నుంచి విషయ సేకరణకు యత్నిస్తారు. మిత్రుల సూచనలు మీపై ప్రభావం చూపుతాయి.
 
సింహం : పత్రికా సంస్థలోని ఉద్యోగస్తులకు యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం అత్యుత్సాహం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది. ఖర్చులు, చెల్లింపులలో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.
 
కన్య : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు పుంజుకుంటాయి. కొంతమంది మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
తుల : దైవ, సేవా, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. లౌక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. ఆస్తి పంపకాల్లో పెద్దల నిర్ణయం నిరుత్సాహపరుస్తుంది.
 
వృశ్చికం : తీర్థయాత్రలు, కొత్త ప్రదేశం సందర్శనలు కొత్త అనుభూతినిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది.
 
ధనస్సు : లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రియతముల కలయిక సంతోషపరుస్తుంది. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు.
 
మకరం : తలపెట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదాపడతాయి. ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆహార, వ్యవహారాలు, ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.
 
కుంభం : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల విషయంలో జాప్యం తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా సాగుతాయి. క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. ఉద్యోగస్తులకు తోటివారివల్ల అదనపు పనిభారం తప్పదు.
 
మీనం : వృత్తి ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పదు. స్త్రీలకు పట్టింపులు అధికంగా ఉంటాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గడప దాటి వెళ్లేటపుడు కుడికాలు మాత్రమే లోపలికి వేయాలి, ఎందుకు?