శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సినవి ఇంకా ఎన్నో వున్నాయి. అందులో కొన్ని..
కృష్ణానది మధ్యలో బంగారు రథం బైటపడుతుంది. అది చూసి ప్రజలు కనులు పోగొట్టుకుంటారు. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడు. తిరుపతికి వెళ్ళే అన్నీ దారులూ ముసుకుపోతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు.
* రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెప్తుంది.
* శ్రీ కాళహస్తి గుడిలో దోపిడి జరుగుతుంది.
* మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడు.
* భర్తలను భార్యలు ఏలుతారు.
* ఉత్తములైన వారు అల్పులకు దాసితనము చేస్తారు.
* కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు.
* సర్వ వస్తువులూ కల్తీ అవుతాయి.
* భర్తలను భార్యలూ, భార్యలను భర్తలూ ధనం కోసం వేపుకు తింటారు.
* నీటిని కొనుగోలు చేస్తారు.