కంఠమునందు పుట్టుమచ్చ ఉన్నచో మెుదట పురుష సంతానం కలుగును. కుడి భుజానికి పుట్టుమచ్చ ఉంటే.. ఆ స్త్రీ చెడ్డ స్వభావం కలిగియుండును. భర్తను నిర్లక్ష్యంగా చూచును. సంతానం మీద విరక్తిని కలిగియుండును. కులాచారములను విడనాడును.
అదే మచ్చ ఎడమ భుజం మీద ఉన్నచో.. శుభఫలితములను కలుగజేయును. స్త్రీ సంతానమును, పతివ్రతా లక్షణములను, సౌఖ్యజీవితమును, గౌరవ జీవితమును కలుగజేయును. ఎడమ కుచమునకు కుడిభాగాన పుట్టుమచ్చ ఉన్నచో.. సామాన్య జీవితమును కలిగియుండును. మాటల చేతనే ఇతరులను మెప్పించు శక్తి కలిగియుండును.
వామకుచమునకు క్రింద గుండెకు మీది భాగంలో మచ్చ ఉన్నచో ఆ స్త్రీకి ప్రసవవేదన అతంగా ఉండదు. స్నేహసద్భావములు కలిగియుండును. కుచమునకు పై భాగాన పుట్టుమచ్చ ఉన్నచో.. ఆ స్త్రీ చంచలస్వభావం, తీరనికామం, అమితఆస, దుష్ప్రవర్తన, నిరసనబుద్ధియు కలిగియుండును. మొత్తం మీద వక్షస్థలమున మచ్చఉన్నచో ఆ స్త్రీ సర్వభోగములు అనుభవించును.