పూజకు వాడే బిల్వ పత్రం ఎండిపోయినా పూజకు శ్రేష్ఠమేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. బిల్వ పొడి, గోరింటాకు గింజల పొడి, గరిక ఆకుల పొడిని సాంబ్రాణీకి ఉపయోగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
శివపురాణం బిల్వ ఆకుల మహిమను వివరించింది. బిల్వ చెట్టులో లక్ష్మి నివాసం ఉంటుంది. ఒక బిల్వ పుష్పం లక్ష బంగారు పువ్వులతో సమానమని చెబుతారు. ఇంట్లో బిల్వ వృక్షాన్ని పెంచుకుంటే అశ్వమేధ యాగం చేసిన ఫలితం, వేయి మందికి అన్నదానం చేసిన ఫలితం, గంగానది వంటి పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది.
అలాగే ఇంట బిల్వ వృక్షాన్ని పెంచితే.. అన్ని దేవాలయాలను దర్శించిన ఫలితాలు లభిస్తాయి. అంతేగాకుండా బిల్వానికి మాత్రమే నిర్మాల్య దోషం ఉండదు.
కొద్దిరోజులు కోసి ఆరిపోయినా పూజకు ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో ఇతర పువ్వులు లేదా ఆకులను ఉపయోగించవద్దు. కానీ బిల్వ ఆకుని అవసరమైనన్ని సార్లు పూజకు ఉపయోగించవచ్చు. ఇదే బిల్వ ఆకుకున్న ప్రత్యేకత అంటూ ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.