నాగ పంచమి ఆగస్టు 21న జరుపుకుంటారు. ఈ రోజున పాములను పూజించే భక్తులకు సర్ప భయం, కాల సర్ప దోషం తొలగిపోతాయని నమ్ముతారు.భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాములను పూజిస్తారు. నాగు పాములు జీవించడానికి పాలు, ఇతర ఆహారాలను సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో నాగ పంచమికి ముందు రోజును నాగ చతుర్థి లేదా నాగుల చవితి అని పిలుస్తారు.
ఈ నేపథ్యంలో నాగుల పంచమి రోజున ధనస్సు రాశి వారికి కూడా ఫలప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా ఫలితాలు పొందుతారు.
ఇక వ్యాపారాలు చేసేవారు నాగుల పంచమి రోజున పెట్టుబడులు పెట్టడంతో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఇతరుల దగ్గర ఇరుక్కుపోయిన డబ్బు కూడా సులభంగా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కుంభ రాశి వారికి నాగ పంచమి రోజు చాలా శుభప్రదం కాబోతోంది.
ఈ నెలలో స్వామివారు రెండో సారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. నాగుల పంచమి సందర్భంగా తిరుమలకు భక్తులు మరింత పోటెత్తే అవకాశం ఉంది. శని, ఆదివారాలు వారంతం కావడంతో ఇప్పటికే భక్తుల రద్దీ పెరిగింది.