Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : శనివారం దినఫలాలు .. అవకాశాలు వెతుక్కుంటూ

మేషం : బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విద్యార్థులు బజారు దినుబండరాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానంకూడదు. వృత్తి వ్యాపార సంబంధాలు

Advertiesment
Daily prediction
, శనివారం, 11 నవంబరు 2017 (06:07 IST)
మేషం : బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విద్యార్థులు బజారు దినుబండరాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానంకూడదు. వృత్తి వ్యాపార సంబంధాలు విస్తరిస్తాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది.
 
వృషభం : మీపై వచ్చిన అభియోగాలు, విమర్శలు తొలగిపోగలవు. హామీ, మధ్యవర్తిత్వాలు ఇరకాటానికి గురిచేస్తాయి. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. క్యాటరింగ్ రంగాల వారికి ఆశాజనకం. శ్రీమతి వైఖరి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల ఇంటర్వ్యూల కోసం అనుకూలించదు.
 
మిథునం : ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమువుతాయి. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఖర్చులకు సంబంధించి వ్యూహాలు అమలు చేస్తారు.
 
కర్కాటకం : కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పపడతాయి.
 
సింహం : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లకు పనిమీద ధ్యాస తగ్గటం వల్ల సమస్యలు తప్పవు. స్త్రీల ప్రతిభ, అర్హతలకు సంబంధించిన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య : ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించుకోండి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. మీ చికాకులు, సమస్యలు, ఇబ్బందులు త్వరలో కొలిక్కి వస్తాయి. సభ్యత్వాలు, పదవులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల : రాజకీయాలు, కళ, సాంస్కృతిక, ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధించం కష్టం. ఓర్పు, మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. స్త్రీలకు అయినవారితో పట్టింపులెదురవుతాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభించగలదు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
వృశ్చికం : కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడతాయి. మీ రాబడికి తగినట్లుగా ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. మీ నిర్ణయాలు, కార్యక్రమాలలో స్వల్ప మార్పులుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
 
ధనస్సు : విదేశాల్లోని మీ సంతానం యోగక్షేమాలు సంతృప్తినిస్తాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఇతరులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు బాధిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం వేరొక వ్యవహారానికి వెచ్చించాల్సి ఉంటుంది.
 
మకరం : ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. తలపెట్టిన పనుల సవ్యంగా సాగకవిసుగు కలిగిస్తాయి. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతంకాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం క్షేమదాయకం.
 
కుంభం : ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. వాహనం నపుడునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.
 
మీనం : అర్థంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. దైవదీక్షలు, సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. వాదోపవాదాలకు భేషజాలకు దూరంగా ఉండండి. ఫ్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం ఉసిరితో అలా చేస్తే ధనవంతులే..