Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : 07-11-2017నాటి దినఫలితాలు

మేషం : ఆర్థికస్థితి ఒకింత మెరుగుపడటంతో ఊరట చెందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఎల్ఐసి, బ్యాంకింగ్, ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత. దైవదర్శనాల్లో పాల్గొంటారు. వృత్తులవారిక

Advertiesment
శుభోదయం : 07-11-2017నాటి దినఫలితాలు
, మంగళవారం, 7 నవంబరు 2017 (05:50 IST)
మేషం : ఆర్థికస్థితి ఒకింత మెరుగుపడటంతో ఊరట చెందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఎల్ఐసి, బ్యాంకింగ్, ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత. దైవదర్శనాల్లో పాల్గొంటారు. వృత్తులవారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. 
 
వృషభం : కిరాణా, వస్త్ర, వ్యాపారులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ప్రేమికుల తొందరపాటు చర్యలు ఇబ్బందులకు దారితీస్తాయి. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య ఒప్పందాలలో ఏకాగ్రత, పునరాలోచన ఎంతో ముఖ్యం. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఎదుర్కొన్నా సత్ఫలితాలు పొందుతారు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మీ దైనందిన కార్యక్రమాలలో మార్పులుంటాయి. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. 
 
కర్కాటకం : సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. స్టాక్ మార్కెటింగ్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కొబ్బరి పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ వహించండి. 
 
సింహం : స్త్రీలు తెలివితేటలతో వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. విద్యార్థుల వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఇంక్రిమెంట్లు, అడ్వాన్సులు లభిస్తాయి. గృహంలో పనులు వాయిదాపడతాయి. మార్కెటింగ్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. 
 
కన్య : ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. నూతన వ్యాపారానికి కాలవలసిన పెట్టుబడులను సమకూర్చుకుంటారు. విద్యార్థులకు మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. 
 
తుల : వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పారిశ్రామిక రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలు విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రయాణాలు, ఖర్చులు సంబంధించి వ్యూహాలు అమలు చేస్తారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలను గ్రహిస్తారు. ఆహార, ఆరోగ్య వ్యవహారాలలో మెళకువ వహించండి. 
 
వృశ్చికం : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువలకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
ధనస్సు : భాగస్వామిక చర్చలు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారమవుతాయి. దూరంలో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు. 
 
మకరం : చిన్నారులకు విద్య, ఖరీదైన వస్తువులు కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. క్యాటరింగ్ పనివారలకు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. బంధుమిత్రుల రాకపోకల వల్ల ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొత్తకొత్త ఆలోచనలతో సరికొత్త అధ్యాయానికి స్వాగతం పలుకుతారు. 
 
కుంభం : ఆర్థికస్థితిలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపనవల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు, బహుమతులు వస్తాయి. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. 
 
మీనం : మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. రాజకీయాలు, కళ, సాంస్కృతిక, ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధించడం కష్టం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : 06-11-17నాటి దినఫలాలు