శుభోదయం : 08-11-2017నాటి దినఫలితాలు
మేషం : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాల లాభసాటిగా సాగుతాయి. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. గుర్తింపు లేనిచోట శ్రమ
మేషం : హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాల లాభసాటిగా సాగుతాయి. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. గుర్తింపు లేనిచోట శ్రమపడరాదు. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది.
వృషభం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కంది, ఎండుమిర్చి, ధనియాలు, బెల్లం, ఆవాలు, స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో సఫలీకృతులు కాగలరు.
మిథునం : ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం అవసరమని గమనించండి. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే కోరిక నెరవేరగలదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. బిల్లులు చెల్లిస్తారు.
కర్కాటకం : సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. విద్యార్థులకు కొన్ని నిర్భందాలకు లోనవుతారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. ఇతరుల ముందు మీ కుటుంబ విషయాలు ఏకరవు పెట్టటం మంచిది కాదు.
సింహం : ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసివస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చికాకులు, నిరుత్సాహం తప్పదు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు మందకొడిగా సాగుతాయి.
కన్య : వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు టి.వి కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువులు, ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. విజయాలు తేలికగా సొంతమవుతాయి.
తుల : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కుటుంబీకులతో కలిసివిందు, వివోదాలలో పాల్గొంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
వృశ్చికం : దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వాయిదాపడతాయి. నిరుద్యోగులు ఒక పత్రికా ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. యాదృచ్ఛికంగా పాత మిత్రులను కలుసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగాత ఉంటుంది. బిల్లులను చెల్లిస్తారు.
ధనస్సు : మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచండి. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంద. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. విద్యార్థినులు భయాందోళనలు వీడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి.
మకరం : వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనిగోలుదార్లను ఆకట్టుకుంటారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. అనుకోకుండ బాకీలు వసూలవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ఏ పని మొదలు పెట్టనా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. బంధువులను కలుసుకుంటారు.
కుంభం : కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గృహోపకరణాలను అమర్చుకుంటారు. మిమ్ములను పొగిడేవారిని ఓ కంటకని పెట్టటం ఉత్తమం. ప్రముఖులను కలిసి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి.
మీనం : మీ అవసరాలకు కావలసిన ధనం అతికష్టంమ్మీద సర్దుబాటు అవుతుంది. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య పట్టింపులుత, చికాకులు అధికమవుతాయి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును, డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు.