Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాట్స్ బాలల సంబరాలకు విశేష స్పందన: ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న చిన్నారులు

నాట్స్ బాలల సంబరాలకు విశేష స్పందన: ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న చిన్నారులు
, మంగళవారం, 22 డిశెంబరు 2020 (22:19 IST)
డల్లాస్: ప్రతి యేటా అమెరికాలో తెలుగు చిన్నారులు ప్రతిభ పాటవాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తున్న  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ బాలల సంబరాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్ ద్వారా నాట్స్ ఈ బాలల సంబరాలను నిర్వహించింది. ఐదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయస్సు ఉన్న చిన్నారులు ఈ సంబరాల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు చిన్నారుల ఆట, పాటలకు ఇది చక్కటి వేదిక కావడంతో చాలా మంది చిన్నారులు ఈ సంబరాల్లో పాల్గొని తమ ప్రతిభను చూపారు.
 
కూచిపూడి, భరతనాట్యంతో పాటు భారతీయత ఉట్టిపడే ఎన్నో నృత్యాలను చేసి తమలోని భారతీయతను, తెలుగుదనాన్ని చూపెట్టారు. చక్కటి గాత్రంతో తియ్యటి తెలుగుపాటలను ఎంచుకుని బాలల సంబరాల్లో  గాన మాధుర్యాన్ని పంచారు.  తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చక్కటి తెలుగులో వారు పాడిన పాటలు అందరిని అలరించాయి. గానం, నృత్యం, చిత్ర లేఖనం, వ్యాసరచన, వస్త్రధారణ, హాస్య నాటికలు ఇలా బాలలకు ఎన్నో పోటీలు పెట్టి వారిలో తెలుగు పట్ల మమకారాన్ని పెంచేందుకు నాట్స్ ప్రయత్నించింది. 
 
నాట్స్ డాలస్ చాప్టర్ సమన్వయకర్త రాజేంద్ర కాట్రగడ్డ, మాధవి ఇందుకూరి, చక్రపాణి కుందేటి, రాజేంద్ర యనమదల లు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ కిషోర్ వీరగంధం ఈ బాలల సంబరాలకు సహకారాన్ని అందించారు. నాట్స్ బోర్డ్ డైరక్టర్స్ ఆది గెల్లి, ప్రేమ్ కలిదిండి, కిషోర్ కంచర్ల మద్దతు కూడా  ఈ సంబరాల విజయంలో కీలకపాత్ర పోషించింది.
 
ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని విజేతలు ప్రకటించి నాట్స్ ఆన్ లైన్ వేదికగా వారిని అభినందించింది. నాట్స్ డాలస్ విభాగం ఈ బాలల సంబరాలను ఘనంగా నిర్వహించిన డాలస్ నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని ప్రత్యేకంగా అభినందించారు. కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ఆన్‌లైన్ ద్వారా తెలుగువారిని ఏకం చేసేలా బాలల సంబరాలను నిర్వహించడంపై నాట్స్ పై ప్రవాస తెలుగువారు ప్రశంసల వర్షం కురిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి పాలను గర్భిణీ మహిళలు తీసుకుంటే?