Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యాపారానికి అనువైన రోజులు.. ఆ రెండే..?

నవరాత్రుల్లో విశిష్టమైన దుర్గాష్టమి (నవరాత్రుల్లో ఎనిమిదో రోజు)ని మహాష్టమి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు.

వ్యాపారానికి అనువైన రోజులు.. ఆ రెండే..?
, సోమవారం, 15 అక్టోబరు 2018 (11:25 IST)
నవరాత్రుల్లో విశిష్టమైన దుర్గాష్టమి (నవరాత్రుల్లో ఎనిమిదో రోజు)ని మహాష్టమి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. వినాయక చవితి మాదిరిగానే దుర్గాష్టమి నాడు విద్యార్థులు తమ పుస్తకాలను పూజలో ఉంచి ప్రార్థించాలి. ఇలా చేస్తే సరస్వతీ మాత కృపతో విద్యారంగంలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు. 
 
పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తుంటాం.  
 
తల్లిదండ్రులు పిల్లలను ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమం. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే విద్యావంతులు అవుతారని విశ్వాసం. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు.  
 
స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరూ దుర్గాదేవిని అర్చిస్తారు. దుర్గాష్టమి రోజున ఉపవాసం ఉంటారు. నవరాత్రులను పురస్కరించుకుని భక్తులు శక్తిపీఠాలను దర్శించుకుంటారు. దుర్గాష్టమి, విజయదశమి విశేష పర్వదినాల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి పూజలు చేయించుకునే వారికి సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-10-2018 సోమవారం దినఫలాలు - శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం...