Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

Advertiesment
Lady victim

ఠాగూర్

, మంగళవారం, 25 నవంబరు 2025 (12:34 IST)
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతిల్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఓ మహిళతో చేసిన శృంగారంగా మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో క్లిఫ్ ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' అంటూ సదరు మహిళతో ఆయన మాట్లాడారు. ఈ సంభాషణలకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. అయితే, ఈ ఆడియో, చాట్‌ల వాస్తవిక ఇంకా నిర్ధారణ కాలేదు. 
 
మరోవైపు, ఈ ఆరోపణలపై మామ్కూటతిల్ స్పందించారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తాని, ఈ ఆరోపణలపై న్యాయపరంగా ముందుకు వెళతానని చెప్పారు. నా ఫోటో పెట్టి ఆడియోను విడుదల చేశారు.. అది నా గొంతు అవునో కాదో నన్ను అడగటంలో అర్థం లేదు. దేశంలోని ఏ చట్టాన్ని నేను ఉల్లంఘించలేదు. విచారణ సరైన దశకు చేరుకున్నాక నేను చెప్పాల్సింది చెబుతాను అని ఆయన ఓ వార్తా సంస్థతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ లైంగిక ఆరోపణలపై కాంగ్రెస్ నేత కె.మురళీధరన్ స్పందిస్తూ, రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. పైగా, రాహుల్ ప్రస్తుతం పార్టీలో లేరు. ప్రభుత్వం, పోలీసులే చర్యలు తీసుకుంటే పార్టీ తదుపరి అడుగు వేస్తుంది అని వెల్లడించారు. ఈ యేడాది ఆగస్టు నెలలో ఒక నటి, ఒక రచయిత్రి చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు