గర్భంతో వున్నవారు ఎంతో జాగ్రత్తగా వుండాలి. అయితే కొన్నిసార్లు అనుకోకుండా చేసే పనుల వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. 30 వారాల వయసున్న ఒక గర్భిణీ స్త్రీ కింద పడుతున్న అద్దంను ఆపడానికి ప్రయత్నించి. అద్దాన్ని ఓ పిల్లి పడేయడంతో దాన్ని ఆపేందుకు గుబుక్కున లేచి పట్టుకునేందుకు ప్రయత్నించింది.
అనుకోకుండా అద్దం కార్నర్ మహిళ పొత్తికడుపుకి తగలడంతో అల్లాడిపోయింది. తీవ్రమైన నొప్పితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. అదృష్టవశాత్తూ, ఆమెకు సరైన వైద్య సహాయం అందడంతో సురక్షితంగా బైటపడింది.
ప్రమాదం జరిగిన నాలుగు వారాల తర్వాత, ఆమెకు అత్యవసర సి-సెక్షన్ చేయించుకోవలసి వచ్చింది. భయం ఉన్నప్పటికీ, ఆమె మరియు ఆమె కవలలు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ప్రమాదాలు ఎలా జరుగుతాయో ఆమె అనుభవం చూపిస్తుంది.