ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి గిరీశ్ చంద్ర యాదవ్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆయన కాలుని ఓ మూషికం కాటేసి కనిపించకుండా పోయింది. దీంతో పాము కరిసిందని ఆయన భయపడిపోయారు. ఆ వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
ఇటీవల ఆయన యూపీలోని బాందాలో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. తన పర్యటన ముగించుకుని ఓ సర్క్యూట్ భవన్‌లో విశ్రాంతి తీసుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన కాలును కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కపడి లేచారు. పాము కాటేసిందనుకుని ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.
ఈ విషయాన్ని ఆయన తన వ్యక్తి భద్రతా సిబ్బంది తెలిపారు. వారు వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మంత్రిని ఎలుక కొరిందని తేల్చారు. దీంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జ్ చేసారు.