ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లి ముందే ఇద్దరు కామాంధ యువకులు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముజఫర్‌నగర్ జిల్లా కాక్రౌలి ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువతి మెడిసిన్ కొనేందుకు తల్లితో కలిసి బయటకు వచ్చింది. మెడికల్ షాపుకెళ్లి మందులు కొనుగోలు చేసే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వారిని బెదిరించి దగ్గర్లో ఉన్న చెరుకు తోటలోకి తీసుకెళ్లారు.
ఆపై తల్లిని బంధించి కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకు చెప్పొందటూ తల్లీకూతుళ్లను బెదిరించి అక్కడి నుండి పారిపోయారు. ఇంటికి వచ్చిన యువతి జరిగిన విషయాన్ని తండ్రికి వివరించింది. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.