మహిళను పెళ్లాడిన బాలుడిని శిక్షించవద్దు : సుప్రీంకోర్టు

మంగళవారం, 7 జనవరి 2020 (14:20 IST)
ఇటీవల సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పును వెలువరించింది. 21 యేళ్ల వయస్సున్న ఓ మహిళను 18 యేళ్ళ వయసున్న మైనర్ బాలుడు వివాహం చేసుకున్నాడు. ఈ కేసులో బాలుడిని శిక్షించవద్దని అపెక్స్ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. జస్టిస్ మోహన్ ఎం సంతానగౌడర్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 
 
అంతేకాకుండా, బాల్యవివాహ చట్టం 2006లోని సెక్షన్ 9ని గుర్తుచేసింది. ఈ చట్టం ఏం చెబుతుందంటే... ఎవరైనా 18 యేళ్లు పైబడిన యువకులు బాల్య వివాహం చేసుకున్నట్టయితే, వారికి కఠినమైన జైలుశిక్షను విధించాలి. ఈ శిక్ష కాలపరిమితి రెండేళ్లు లేదా శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. 
 
అదే సమయంలో ఓ మహిళ మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్నట్టయితే ఈ చట్టం వర్తించదని అపెక్స్ కోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. దీనికి కారణం.. మన సమాజంలో వివాహానికి సంబంధించిన నిర్ణయాలు సాధారణ వధువు, వరుడు కుటుంబ సభ్యులు తీసుకుంటారు. ఈ విషయంలో స్త్రీలు పెద్దగా తమ అభిప్రాయాన్ని వెల్లడించరని గుర్తుచేసింది. 
 
ఈ బాల్య వివాహ చట్టం 2006లోని సెక్షన్ 9 నిబంధన ఏకైక ఉద్దేశ్యం మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని శిక్షించడమే. ఎందుకంటే.. మైనర్ బాలికలకు రక్షణ కల్పించడమే ప్రధానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ప్రస్తుతం విచారిస్తున్న కేసు అందుకు పూర్తి విరుద్ధమని గుర్తుచేసింది.
 
21 యేళ్ళ మహిళను 18 యేళ్ళ బాలుడు వివాహం చేసుకున్న కేసు. దీనిపై పంజాబ్ - హర్యానా హైకోర్టులో విచారణ జరుగగా, బాలుడుపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని ఆదేశించింది. కానీ, అపెక్స్ కోర్టు ఈ ఉత్తర్వులను తోసిపుచ్చి... మహిళను పెళ్లాడిన బాలుడుని శిక్షించవద్దని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 2020లో వాట్సాప్‌లో రానున్న న్యూ ఫీచర్స్ ఏంటి?